Traffic Pending Challans: రాష్ట్రంలో రాయితీతో పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపు గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. మార్చి 1 తేదీ నుంచి నెలరోజుల పాటు అవకాశం ఇచ్చామని.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండడం వల్ల మరో 15 రోజుల పాటు ఈ అవకాశాన్ని పొగిడిస్తున్నట్లు చెప్పారు. అంటే ఏప్రిల్ 15 వరకు పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించవచ్చన్నారు.
Traffic Pending Challans: ట్రాఫిక్ పెండింగ్ చలానాల చెల్లింపునకు గడువు పెంపు - telangana traffic rules
Traffic Pending Challans: రాయితీపై పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లించేందుకు మరో 15 రోజులు గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, స్పందన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పెండింగ్ చలానాల చెల్లింపుతో మార్చి 1 నుంచి సుమారు 250 కోట్లు రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.
Pending Traffic Challans
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపులు జరిగాయని హోంశాఖ మంత్రి తెలిపారు. 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మహమూద్ అలీ కోరారు.
ఇవీచూడండి:అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కార్లకు జరిమానా.. ఎందుకంటే..?