కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో శ్రీవారి ఉచిత సర్వ దర్శన టైం స్లాట్ టోకెన్ల జారీని తితిదే నిలిపివేసింది. తిరుపతిలోని విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఉచిత సర్వదర్శనం టికెట్లు జారీ చేయడం లేదని పేర్కొంది. ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవ, శ్రీవాణి ట్రస్టు, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని వెల్లడించింది.
తితిదే కీలక నిర్ణయం.. టైం స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత! - Srivari Sarvadarshana time slot tokens has been discontinued latest news
తిరుమల శ్రీవారి ఉచిత సర్వ దర్శన టైమ్‌స్లాట్ టోకెన్ల జారీని.. తితిదే నిలిపివేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
తితిదే కీలక నిర్ణయం