disadvantages by kcr kit: ప్రసవం అనంతరం తల్లీబిడ్డల సంరక్షణ కోసం అందజేస్తున్న కేసీఆర్ కిట్‌లో ఓ వస్తువును కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది. కేసీఆర్ కిట్‌లో ఓ ప్రముఖ సంస్థకు చెందిన టాల్కమ్ పిల్లల పౌడర్‌ను అందజేస్తున్నారు. కాగా ఈ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలున్నాయనే వివాదం నెలకొన్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఈ సంస్థ ఉత్పత్తిపై నిషేధం కొనసాగుతోంది.
కేసీఆర్ కిట్‌లో ఈ పిల్లల పౌడర్‌ను ఉంచాలా, వద్దా - టాల్కమ్ పౌడర్ నిషేధం
disadvantages by kcr kit కేసీఆర్ కిట్‌లో అందజేస్తున్న టాల్కమ్ పిల్లల పౌడర్ పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఈ వస్తువును ఉపయోగించాలా? వద్దా? అని చూస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమిటి..
kcr kit
ఈ క్రమంలో కేసీఆర్ కిట్‌లో అందజేస్తున్న ఆ ఉత్పత్తిని కొనసాగించడంపై తాజాగా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చర్చించారు. జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ ఈ ఉత్పత్తిపై ఎలాంటి ఆదేశాలిస్తుందో వేచి చూడాలి. ఆ తర్వాతనే కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయానికి రావాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. కేసీఆర్ కిట్‌లో ఈ ప్రముఖ సంస్థకు చెందిన ఉత్పత్తులనే ఎక్కువగా అందజేస్తుండగా.. టాల్కమ్ పౌడర్ విషయంలోనే ఈ వివాదం నెలకొంది.
ఇవీ చదవండి: