తెలంగాణ

telangana

ETV Bharat / city

RGV meet AP minister: ముహుర్తం ఖారారు.. రేపే వారిద్దరి కీలక భేటీ - మంత్రి పేర్ని నానిని కలవనున్న డైరెక్టర్ ఆర్జీవీ

RGV meet AP minister: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో.. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సోమవారం భేటీ కానున్నారు. సినిమా టికెట్‌ ధరలపై మంత్రితో.. ఆర్జీవీ చర్చించనున్నారు. దీనిపై వీరిద్దరి మధ్య ట్వీట్​ వార్ నడిచింది.

RGV meet AP minister
మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్​ గోపాల్ వర్మ భేటీ

By

Published : Jan 9, 2022, 10:49 PM IST

RGV meet minister: ఎట్టకేలకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో.. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సోమవారం భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గం.కు సచివాలయంలో సమావేశం కానున్న ఆర్జీవీ.. సినిమా టికెట్‌ ధరలపై మంత్రితో చర్చించనున్నారు. సినిమా టికెట్‌ ధరలపై ఇటీవల పేర్ని నాని, ఆర్జీవీ మధ్య ఇటీవల ట్వీట్‌ వార్‌ నడిచిన సంగతి తెలిసిందే.

varma vs nani: ఈ క్రమంలోనే ఏపీలో సినిమా ఇండస్ట్రీ సమస్యలు వివరించడానికి మంత్రి అపాయింట్‌మెంట్‌ కోరారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. త్వరలోనే కలుస్తానని చెప్పారు. ఈ మేరకు రేపు వీరిద్దరూ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

కొడాలి నాని ఎవరో తెలియదు

ఇటీవల ట్విట్టర్​ ద్వారా ఏపీ మంత్రికి ప్రశ్నలు సంధించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు కొడాలి నాని ఎవరో తెలియదని చెప్పారు. తనకు హీరో నాని మాత్రమే తెలుసునని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడంపై టాలీవుడ్​లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వం చర్యలను కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు వత్తాసు పలకడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details