RGV on Chalo Vijayawada: సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఉద్యమంపై ట్విట్టర్‌లో తనదైన శైలిలో స్పందించారు. చలో విజయవాడకు తరలివచ్చిన వేలాది ఉద్యోగుల చిత్రాలను జోడించి.. ‘‘ఏపీ సర్కారు సంగతేమోగానీ, విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు చలి జ్వరం వచ్చింది’’ అని ట్వీట్ చేశారు.
‘ఉద్యోగులు ఇంత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచంలో ఇలా ఎక్కడైనా జరిగిందంటారా?' అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఏపీలోని నిరసనకారులకు నేనిచ్చే సలహా ఒకటే..! గట్టిగా నినదించాల్సిన సమయంలోనూ మౌనంగా ఉండటం పిరికితనమే' అని మరో ట్వీట్‌లో ప్రస్తావించారు.