భయపడొద్దు.. అప్రమత్తంగా ఉండండి : డాక్టర్ శ్రీనివాస్ - telangana corona strain news
కొత్తరకం కరోనా మహమ్మారి స్ట్రెయిన్‌పై సర్వత్రా ఆందోళన నెలకొంది. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇద్దరికి కొవిడ్ నిర్ధరణ అయినట్లు సమాచారం. వారికి సోకింది కొత్తరకం స్ట్రెయినేనా.. లేదా పాతరకం కరోనానో నిర్ధరించేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కొత్తరకం కరోనా స్ట్రెయిన్ రాష్ట్రాన్ని గజగజలాడిస్తోంది. ఇప్పుడిప్పుడు మహమ్మారి నుంచి కోలుకుంటుంటే స్ట్రెయిన్ పేరుతో కొత్తరకం కరోనా విజృంభిస్తోంది. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇద్దరికి కొవిడ్ నిర్ధరణ అవ్వగా.. వారికి సోకింది కొత్తరకం స్ట్రెయినేనా లేదా అని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ.. యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, పాజిటివ్ వచ్చిన వారి పరిస్థితిపై ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి..
- ఇదీ చూడండి :ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ