రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేలో 17 వేలకుపైగా బృందాలు పాల్గొన్నాయని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు (director of health telangana)తెలిపారు. ఆరోగ్య బృందాలు ఇప్పటి వరకు 6 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే(fever survey) చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ ఓపీలో 11,814 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఇప్పటివరకు 64 ప్రైవేటు ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు వచ్చాయని డీహెచ్ వెల్లడించారు. వీటిని పరిశీలించి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. ఆయా ఆస్పత్రులు 24 నుంచి 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించామని శ్రీనివాసరావు తెలిపారు.