పీఐబీ తీరుపై రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొవిడ్ టెస్టింగ్‌కి సంబంధించి సర్కారు సరైన ప్రయత్నాలు చేయడం లేదని... హైకోర్టు ఈమేరకు డీహెచ్‌కు సమన్లు జారీచేసిందంటూ మంగళవారం పీఐబీ ఓ వార్తను ప్రచురించింది. కొవిడ్ నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అణగదొక్కేలా వార్తను ప్రచురించిందని మండిపడ్డారు. వాస్తవానికి కొవిడ్ టెస్టింగ్, ఆస్పత్రుల సన్నద్ధతపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వాన్ని ప్రశంసించిందని తెలిపారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగానే కరోనా నిర్ధరణ పరీక్షలకు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
పీఐబీ వార్తపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆగ్రహం - తెలంగాణలో కరోనా నియంత్రణపై పీఐబీ వార్త
రాష్ట్రంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలకు సంబంధించి సర్కారు సరైన ప్రయత్నాలు చేయడం లేదని... ఈమేరకు డీహెచ్‌కు హైకోర్టు సమన్లు జారీచేసిందంటూ మంగళవారం పీఐబీ ఓ వార్తను ప్రచురించింది. కొవిడ్ నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అణగదొక్కేలా వార్తను ప్రచురించిందని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ మండిపడ్డారు.
పీఐబీ వార్తపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆగ్రహం