DigiTech Centre in Hyderabad: హైదరాబాద్‌లో డిజిటెక్ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన కాల్ అవే గోల్ఫ్ కంపెనీ ముందుకొచ్చింది. ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కాల్ అవే గోల్ఫ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. టాప్ గోల్ఫ్ బ్రాండ్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న కాల్ అవే.. హైదరాబాద్‌లో నెలకొల్పనున్న నూతన డిజిటెక్ సెంటర్ ద్వారా కొత్తగా 300 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి కల్పించనుంది.
కాల్ అవే ప్రకటనను ఆహ్వానించిన మంత్రి కేటీఆర్.. గోల్ఫ్ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణలో తయారీ యూనిట్ నెలకొల్పాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. దీంతో పాటు రాష్ట్రంలో స్పోర్ట్స్ టూరిజంలో భాగం కావాలని ఆహ్వానించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు.