తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో అమలు కాబోతోన్న డిజిలాకర్ విధానం!

డిజిటల్​ ఆధారిత ధ్రువపత్రాల వ్యవస్థ- డిజిలాకర్​ విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్​ విధానంలో ధ్రువీకరించిన ధ్రువపత్రాలను పౌరులు పొందేలా డాక్యుమెంట్​ వ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తూ 2015లో కేంద్రం ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

digilocker process to be implemented in telangana state
తెలంగాణలో అమలు కాబోతోన్న డిజిలాకర్ విధానం!

By

Published : Nov 4, 2020, 8:23 PM IST

డిజిటల్​ ఆధారిత ధ్రువపత్రాల వ్యవస్థ- డిజిలాకర్​ విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఐటీ, ఎలక్ట్రానిక్స్​, కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్​ విధానంలో ధ్రువీకరించిన ధ్రువపత్రాలను పౌరులు పొందేలా డాక్యుమెంట్​ వ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015లో డిజిలాకర్​ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు, సంస్థలు, యూనివర్సిటీల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

డిజిలాకర్​ విధానాన్ని అమలు చేసుకునేందుకు ఆయా సంస్థలు డిజిటల్​ లాకర్​ విధానంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పౌరులకు ఇప్పటికే జారీ చేసిన, చేయబోయే ధ్రువపత్రాలను డిజిటల్ విధానంలో అందుబాటులో ఉంటే సాఫ్ట్​వేర్​ సిద్ధం చేసుకుని అనుసంధానించాలి. ఇందుకోసం ఆయా శాఖలు, సంస్థలకు ఐటీశాఖ, రాష్ట్ర ఈ-గవర్నెన్స్ మిషన్ బృందం అవసరమైన సహాయ సహకారాలు అందించనున్నాయి.

ఇదీ చదవండి:రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు

ABOUT THE AUTHOR

...view details