తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇక నుంచి ఎయిర్‌పోర్టులో బోర్డింగ్‌ కోసం వెయిటింగ్ అక్కర్లేదు

Digi Yatra at airports విమానాశ్రయంలో ఇక బోర్డింగ్ కోసం గంటల తరబడి క్యూ లో వేచిఉండాల్సిన అవసరం లేదు. ఇక నుంచి డైరెక్ట్‌గా టెర్మినల్ వద్దకు చేరుకోవచ్చు. ప్రయాణికుల కోసం కేంద్ర సర్కార్ డిజియాత్ర అనే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ సాయంతో ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతికత ఆధారంగా ప్రయాణికులు చెకిన్ అయ్యే వీలుంటుంది.

Digi Yatra at airports
Digi Yatra at airports

By

Published : Aug 17, 2022, 6:48 AM IST

Digi Yatra at airports : విమానాశ్రయంలో టికెట్‌ లేదా బోర్డింగ్‌ పాస్‌, ధ్రువీకరణ పత్రాలు పట్టుకుని క్యూలో ఎక్కువ సమయం నిల్చునే అవసరం లేకుండా ఇకపై నేరుగా టెర్మినల్‌ వద్దకు చేరుకోవచ్చు. ఇందుకువీలుగా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘డిజియాత్ర’ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ సాయంతో ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతికత) ఆధారంగా ప్రయాణికులు చెకిన్‌ అయ్యే వీలుంటుంది.

Digi Yatra App at airports : కేంద్రం తీసుకొచ్చిన డిజియాత్ర సాంకేతిక వ్యవస్థను ఇప్పటికే దిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఈ సేవలు ఆరంభమవనున్నాయి. ఈ సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో డిజియాత్ర యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఆధార్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబరును నమోదు చేయాలి. దీని ఆధారంగా డేటాబేస్‌ నుంచి ఆ యాప్‌ ఇ-కేవైసీ వివరాలు తీసుకుంటుంది. దీని ఆధారంగా ముఖ గుర్తింపు తీసుకునేందుకు ప్రయాణికులు సెల్ఫీ తీసుకోవాలి.

అనంతరం తమ డిజియాత్ర ఐడీలను విమాన బుకింగ్‌లు లేదా బోర్డింగ్‌ పాస్‌తో అనుసంధానించుకోవాలి. దీని సాయంతో ప్రయాణికులు నిర్దేశిత చెక్‌పాయింట్ల వద్ద ముఖ గుర్తింపు వ్యవస్థ ఆధారంగా నేరుగా వెళ్లవచ్చు. టికెట్లు/బోర్డింగ్‌ పాస్‌ల కోసం భౌతిక గుర్తింపు కార్డులను చూపించనక్కర్లేదు. క్యూలో నిలబడే సమయం తగ్గుతుంది. ఈ యాప్‌ వినియోగం ఐచ్ఛికమేనని, నాన్‌ బయోమెట్రిక్‌ వ్యవస్థ సైతం అందుబాటులో ఉంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details