Digi yatra services at Hyderabad Airport : హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజియాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి. తనిఖీలు, ధ్రువీకరణ పత్రాల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు చూస్తున్నారు. అలాగే ప్రయాణికులు వేచి ఉండే అవసరం లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత సాయంతో విమానాశ్రయంలో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకునే సదుపాయంలో భాగంగా కేంద్రం దీనికి శ్రీకారం చుట్టింది.
ఈ సాంకేతికతను ఎయిర్‌పోర్టు ముఖ్య కార్యనిర్వాహణాధికారి ప్రదీప్‌ఫణీకర్ అధికారికంగా ప్రారంభించారు. డిజియాత్ర యాప్ సాయంతో ప్రవేశించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇ-గేట్‌ను కేటాయించారు. అనంతరం ఓ ప్రయాణికుడు యాప్ సేవలతో ముఖ గుర్తింపు సాంకేతికతతో విమానాశ్రయంలోకి వెళ్లాడు. దేశంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చిన ఐదు విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఒకటి కావడం విశేషం.