తెలంగాణ

telangana

ETV Bharat / city

Vehicle Number plates : వాహనాల నంబర్ ప్లేట్లు.. ఒక్కో రంగుది ఒక్కో ప్రత్యేకత - vehicle number plate color defines its speciality

సాధారణంగా వాహనాలకు తెలుపు రంగు ప్లేట్ ఉండి దానిపై నలుపు రంగుతో నంబర్లు ఉంటాయి. ఇలాంటి నంబర్ ప్లేట్​(Number plates)నే మనం ఎక్కువగా చూస్తుంటాం. దీంతోపాటు నలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులో కూడా నంబర్ ప్లేట్లు ఉంటాయని తెలుసా? ఒక్కో రంగు నంబర్​ ప్లేట్​(Number plates)కు ఒక్కో ప్రత్యేకత ఉంటుందట. మరి ఏ రంగు స్పెషాలిటీ ఏంటో చూసేయండి...

వాహనాల నంబర్ ప్లేట్లు
వాహనాల నంబర్ ప్లేట్లు

By

Published : Sep 2, 2021, 12:20 PM IST

‘రోడ్లపై నడిచే వాహనాలకు బిగించే నంబరు ప్లేట్లు(Number plates) రంగురంగులుగా కనిపిస్తాయి. ప్రతి రంగు నంబరు ప్లేటు(Number plates)కు ఓ ప్రత్యేకత ఉంటుంది. రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాహనం కేటగిరీని బట్టి ప్రమాద సమయంలో బీమా, ఇతర పనులు సులువుగా పూర్తి చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇందుకు రవాణా శాఖ ఆరు రంగుల్లో నంబరు ప్లేట్లను రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇవన్నీ హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లుగా మార్చి ఏ సమయంలోనైనా నంబర్లు మార్పులు చేయడానికి అవకాశం లేకుండా ఆన్‌లైన్‌ విధానం ద్వారా వాహనాలకు బిగిస్తున్నామ’ని రవాణా శాఖ అధికారి కంచి వేణు తెలిపారు.

  • నలుపు రంగు:సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కోసం అద్దెకిచ్చే వాహనాలకు నలుపు రంగు ప్లేటుపై పసుపు రంగు నంబర్లు ఉంటాయి. విలాసవంతమైన హోటళ్ల రవాణాతోనూ ఈ వాహనాలు ప్రాచుర్యం పొందాయి. ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్‌ పర్మిట్‌ లేకుండానే ఈ కార్లను వాణిజ్య పరంగా వినియోగించవచ్చు.
  • ఆకుపచ్చ రంగు :ఎలక్ట్రిక్‌(విద్యుత్‌) వాహనాలకు ఆకుపచ్చ రంగు నంబరు ప్లేటు ఉంటుంది. ఎలాంటి కాలుష్య ఉద్గారాలు వెలువడని ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఈ రంగు నంబరు ప్లేటును కేటాయిస్తారు.
  • పసుపు రంగు :పసుపు రంగు ప్లేటు మీద నలుపు ఇంకుతో సంఖ్యలు రాసి ఉంటే రవాణా వాణిజ్య వాహనం అంటారు. ఇలాంటి రంగును ట్రక్‌, ట్యాక్సీలకు చూస్తారు. ప్రయాణికులు, సరకును తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను ఉపయోగిస్తారు.
  • తెలుపు రంగు :సాధారణ వాహనాలకు తెలుపు నంబరు ప్లేటు ఉంటుంది. ఈ వాహనాలను ఎటువంటి రవాణా, వాణిజ్య అవసరాలకు వాడేందుకు వీల్లేదు. తెలుపు ప్లేటుపై నలుపు అక్షరాలు లిఖిస్తారు. తెలుపు రంగు చూడగానే అది వ్యక్తిగత వాహనమని సులభంగా గుర్తించవచ్చు.
  • ఎరుపు రంగు :కొత్త వాహనాలకు రవాణా శాఖ అధికారి శాశ్వత రిజిస్ట్రేషన్‌ కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేస్తే ఇలాంటి నంబరు ప్లేట్లు కనిపిస్తాయి. ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ ఒక నెల వరకు చెల్లుతుంది. అన్ని రాష్ట్రాలు ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ వాహనాలను అనుమతించట్లేదు.
  • నీలి రంగు :విదేశీ ప్రతినిధులు, రాయబారుల వాహనాలకు నీలి రంగు నంబరు ప్లేటు ఉంటుంది. ఆ ప్లేటుపై తెలుపు ఇంకుతో నంబరు ముద్రిస్తారు. ఆ ప్లేటు రాష్ట్రం కోడ్‌ కాకుండా ప్రతినిధుల దేశ కోడ్‌ను సూచిస్తుంది.

ఇదీ చదవండి :Tollywood drugs case: సినీనటి ఛార్మిపై ఈడీ ప్రశ్నల వర్షం... కెల్విన్‌ సమాచారమే కీలకం!

ABOUT THE AUTHOR

...view details