ఫ్యాన్స్... తమ అభిమాన నటులను ఒక్కసారైనా కలుసుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం ఎలాంటి సాహసమైనా చేసేందుకు సిద్ధమవుతుంటారు. వాళ్లు చేసే పనుల ద్వారా తమకున్న అభిమానాన్ని తెలియజేయాలని.. తద్వారా ఒక్కసారైన కలుసుకుని సంబరపడిపోవాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. అందులోనూ.. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానుల గురించి.. వాళ్ల అభిమానం గురించి.. కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయనను ఒక్కసారైనా కలుసుకుని తమ కష్టాలు చెప్పుకోవాలని తపిస్తుంటారు.
Pawan Kalyan: పవర్‌స్టార్‌ను కలుసుకునేందుకు వీరాభిమాని పాదయాత్ర - mahaboobnagar news
ఏ వేదికలో చూసిన కనిపించే అభిమానులు పవర్‌స్టార్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరోను కలుసుకునేందుకు ఎలాంటి సాహసానికైనా సిద్ధపడే వాళ్లే పవర్కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్. అవును.. తన అభిమాన తారను ఒక్కసారైనా ప్రత్యక్షంగా కలుసుకోవాలని ఓ పవర్‌స్టార్ వీరాభిమాని కాలినడకన జిల్లాలు దాటి హైదరాబాద్‌కు చేరుకున్నాడు.

die hard fan walked 180 kilometers to meet power star pawan kalyan
అలాంటి ఓ పవర్‌స్టార్ డై హార్డ్ ఫ్యాన్... ఆయనను ఎలాగైనా కలుసుకోవాలని 180 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపూర్‌కు చెందిన రవి... తన అభిమాన నటుడి కోసం.. తన ఇంటి నుంచి పాదయాత్రగా బయలుదేరాడు. నాలుగు రోజుల పాదయాత్ర అనంతరం ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. కేవలం పవన్‌కల్యాణ్‌ను కలుసుకోవాలనే నాలుగు రోజుల పాటు పాదయాత్ర చేసినట్లు రవి తెలిపాడు.