ఏపీలోని సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టై .. రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను అనిశా కస్టడీలోకి తీసుకుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు. ధూళిపాళ్లతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను తీసుకెళ్లారు. వీరిని ఈ నెల 5 వరకు విచారించేందుకు అనిశా ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. ఆ మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ తరలించారు.
అనిశా కస్డడీకి ధూళిపాళ్ల నరేంద్ర.. విజయవాడకు తరలింపు - ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వార్తలు
ఏపీలోని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను తరలించారు. ధూళిపాళ్లను ఐదు రోజులపాటు అనిశా అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సంగం డెయిరీ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసు నమోదు చేసింది.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం విజయవాడకు తరలింపు
తండ్రిని చూసేందుకు..
జైలు వద్ద తండ్రిని చూసి నరేంద్ర కుమార్తె కన్నీరు మున్నీరైంది. కారు అద్దం తీయమని పోలీసులను బతిమాలాడింది. తండ్రిని తీసుకెళ్తున్న కారు వెంట ఆమె ఆతృతగా బయలుదేరి వెళ్లింది.