తెలంగాణ

telangana

ETV Bharat / city

విధుల్లోకి తీసుకోవాలంటూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన

CITU DHARNA AT RDO OFFICE: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంది జంగ‌య్య అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​లోని ఆర్డీవో ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

CITU DHARNA AT RDO OFFICE
ఆర్​డీవో కార్యాలయం ఎదుట ధర్నా

By

Published : Mar 14, 2022, 7:51 PM IST

CITU DHARNA AT RDO OFFICE: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంది జంగ‌య్య ప్రభుత్వాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్​లోని ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జీవో నెంబర్ 4,779ని రద్దు చేసి.. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ సమ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం రాత్రికి రాత్రే తీసేసిందని ఆరోపించారు.

'రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 7,651మంది ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డున పడ్డారు. వారి కుటుంబాలు ఆగమైపోయాయి. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ కమిషనర్లు, కలెక్టర్లకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలి. లేదంటే పోరాటాలను ఉద్దృతం చేస్తాం.'

-పంది జంగ‌య్య, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఈ కార్యక్రమంలో సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా వ్యవసాయ కార్మికసంఘం కార్యదర్శి జగన్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.జగదీశ్, డి.కిషన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మీరు చేసిన తప్పులను సరిదిద్దడం తప్పా?: మంత్రి హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details