ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంగరక్షకుడిగా పనిచేసిన వ్యక్తి రెండురోజుల క్రితం కరోనా సోకి మృతి చెందారు. ఎమ్మెల్యే గన్‌మెన్ నుంచి ఏడుగురికి వైరస్ సోకింది. లక్షణాలు కనిపించగానే పరీక్ష చేసుకుని ఉంటే ప్రమాదం తప్పేదని శాసనసభ్యుడు కేతిరెడ్డి తెలిపారు. పరీక్ష చేయించుకోకపోవటం వల్లే నలుగురు అంగరక్షకులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా తేలినట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పష్టం చేశారు.
కరోనాతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గన్‌మెన్ మృతి - covid cases in andhrapradesh
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్‌మెన్‌కు కరోనా సోకి మరణించారు. ఈ నేపథ్యంలో తనకు రెండు సార్లు పరీక్షలు చేయగా కొవిడ్ నెగిటివ్‌గా ఫలితాలు వచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గన్‌మెన్ మృతి