తెలంగాణ

telangana

ETV Bharat / city

తితిదే ఇంఛార్జి ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు - ttd new eo news

తితిదే ఇంఛార్జి ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళుతున్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.. తితిదే ఈవో బాధ్యతలను ధర్మారెడ్డికి అప్పగించారు. అనంతరం సింఘాల్​కు తితిదే సిబ్బంది వీడ్కోలు పలికారు.

dharmareddy-took-charges-as-ttd-incharge-eo
తితిదే ఇంఛార్జి ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు

By

Published : Oct 4, 2020, 5:27 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల తిరుపతి దేవస్థాం అదనపు ఈవో ధర్మారెడ్డి.. ఇంఛార్జి ఈవోగా ఆదివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్తోన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌.. తితిదే ఈవో బాధ్యతలను ధర్మారెడ్డికి అప్పగించారు.

అనంతరం సింఘాల్‌ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. సింఘాల్‌కు తితిదే సిబ్బంది వీడ్కోలు పలికారు.

ఇదీ చదవండి:యాదాద్రి బాలాలయంలో విశేష పూజలు

ABOUT THE AUTHOR

...view details