కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు సైతం తహసీల్దార్లే చేసేలా ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. దసరా నుంచి ధరణి ప్రారంభమవుతున్న దృష్ట్యా.... ఆ లోగానే అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. తహసీల్దార్‌తో పాటు డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ధరణి ఆపరేటర్లకు కూడా శిక్షణ ఇస్తారు.
'ధరణి' కోసం రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి స్థాయి శిక్షణ - bharani website details
దసరా నుంచి ప్రారంభం కానున్న ధరణి వెబ్సైట్ కోసం రెవెన్యూ ఉద్యోగులందరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రేషన్లు చేసే తహసీల్దార్ నుంచి ధరణి ఆపరేటర్ల వరకు శిక్షణ ఇవ్వనుంది.
!['ధరణి' కోసం రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి స్థాయి శిక్షణ dharani training to all revenue employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8979610-614-8979610-1601364872643.jpg)
dharani training to all revenue employees
శిక్షణ కోసం వారి వివరాలతో కూడిన జాబితా అందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. దసరాలోగా శిక్షణ పూర్తి చేయడంతో పాటు నమూనా ట్రయల్స్ కూడా నిర్వహించి రిజిస్ట్రేషన్లు, ధరణి నిర్వహణపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు.