రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్... ధరణి సేవల ప్రక్రియ గురించి సీఎస్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల కోసం ఇవాళ 946 మంది నగదు చెల్లించగా... 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్టు సీఎస్ తెలిపారు.
శంషాబాద్‌లో ధరణి సేవలు పరిశీలించిన సీఎస్ సోమేష్ కుమార్ - cs somesh kumar review dharani services
![శంషాబాద్‌లో ధరణి సేవలు పరిశీలించిన సీఎస్ సోమేష్ కుమార్ dharani services started in telangana from today onwards](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9398496-833-9398496-1604299723229.jpg)
12:00 November 02
శంషాబాద్‌లో ధరణి సేవలు పరిశీలించిన సీఎస్ సోమేష్ కుమార్
హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందించనున్నారు. ఇప్పటి వరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం చేశారు. ఏకకాలంలోనే సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయనున్నారు. ఈ పోర్టల్‌ను అక్టోబర్ 29న... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
మీ సేవా కేంద్రాలలోనూ రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని సీఎస్ తెలిపారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌కు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. ఒక్క శాతం కూడా అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా ధరణి సేవలందించాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. దీని కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. త్వరలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:నేటి నుంచి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు