ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు రూ.5.16 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారి ఆలయాన్ని పాలకవర్గం ముస్తాబు చేశారు. 500, 200, 100, 50, 20, 10 రూపాయల కొత్త నోట్లతోపాటూ ఏడు కేజీల బంగారం, 60 కేజీల వెండితో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట ప్రాంతంలో కొలువై ఉందీ.. వాసవి కన్యాకాపరమేశ్వరీ దేవాలయం. ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా వివిధ కళాకృతులతో తీర్చిదిద్దారు. దానికితోడు శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయం ప్రాంగణం నుంచి గర్బాలయం వరకు.. ఉపాలయాలు, ఆలయం చుట్టూ కొత్త కరెన్సీ నోట్లతో శోభయమానంగా అలంకరించారు. రూ.5 కోట్ల విలువ కలిగిన నోట్లతో దండలు తయారుచేసి వేశారు. రూ.2వేల నోటు నుంచి రూ.20 నోటు వరకు అలంకరణలో వినియోగించారు.