తెలంగాణ

telangana

ETV Bharat / city

PROMOTIONS: రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు డీజీపీ హోదా - గోవింద్ సింగ్ ఐపీఎస్

DGP status
DGP status

By

Published : Aug 25, 2021, 4:20 PM IST

Updated : Aug 25, 2021, 7:26 PM IST

16:18 August 25

PROMOTIONS: రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు డీజీపీ హోదా

పదోన్నతి ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్​కుమార్

రాష్ట్ర పోలీసు శాఖలో బదిలీలు, పదోన్నతులు జరుగుతున్నాయి. రెండురోజులుగా అధికారులకు తీపికబురులు అందుతున్నాయి. ఇప్పటికే నిఘా, ఆర్టీసీలకు కొత్త బాస్​లను ప్రభుత్వం నియమించింది. మరో నలుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.  

రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు డీజీపీ హోదా కల్పించారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఉమేష్ షరాఫ్‌, గోవింద్ సింగ్, రవిగుప్తాకు డీజీపీ హోదాను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంజనీ కుమార్ హైదరాబాద్ సీపీగా డీజీపీ హోదాలో కొనసాగుతున్నారు. గతంలోనే ఈ పోస్టును మహేందర్ రెడ్డి సీపీగా ఉన్నప్పుడు అదనపు డీజీ నుంచి డీజీపీ స్థాయికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.  

ఐపీఎస్ రవిగుప్తా హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. గోవింద్ సింగ్ సీఐడీ డీజీగా పనిచేస్తున్నారు. ఉమేశ్ షరాఫ్ పోలీస్ శాఖ సంక్షేమ విభాగం అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు.  వీరంతా ఇప్పటి వరకు అదనపు డీజీ హోదాలో ఉన్నారు. నేటినుంచి డీజీ హోదాలో కొనసాగుతారు.    పదోన్నతులు లభించిన ఐపీఎస్​లతో పాటు మిగతా పోలీసు అధికారుల బదిలీ జరిగే అవకాశం ఉంది.  

ఇవీ చూడండి: Sajjanar ips: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ... ఆర్టీసీ ఎండీగా నియామకం

Last Updated : Aug 25, 2021, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details