తెలంగాణ

telangana

ETV Bharat / city

'డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసు.. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తాం' - DGP Rajendranath Reddy at tirupti

DGP Rajendranath Reddy: ఏపీ వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ బాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతిపై కేసు నమోదు చేశామని.. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేస్తామని ఆ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వైద్య నివేదికలు రాగానే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామన్నారు.

'డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసు.. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తాం'
'డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసు.. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తాం'

By

Published : May 21, 2022, 9:32 PM IST

DGP Rajendranath Reddy on MLC driver Subramaniam death: ఆంధ్రప్రదేశ్​ వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పోలీసుల విచారణ కొనసాగుతోందని.. పోస్టుమార్టం, వైద్య నివేదికల అనంతరం పూర్తిస్ధాయి విచారణ చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేస్తామని తెలిపారు. తిరుపతిలో తిరుపతి, చిత్తూరు జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో రోడ్డు ప్రమాదాలు, హత్యలు, గృహహింసలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడిన డీజీపీ.. రాష్ట్రంలోని పలు తాజా అంశాలపై స్పందించారు.

'డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసు.. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తాం'

విజయవాడ సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల స్పందన సరిగా లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు డీజీపీ చెప్పారు. ఉమ్మడి చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను త్వరలో పునరుద్ధరణ చేస్తామని.. నిషేధిత వస్తువులను తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నేరాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

రాష్ట్రంలో సైబర్ క్రైం ఆదోళనకరంగా ఏమీ లేదని.. అయినప్పటికీ సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గిందన్నారు. ఆ సమయంలో నమోదైన క్రైం రేటును పోలీసు శాఖ ప్రామాణికంగా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి నారాయణ కేసులో ఏపీపీ సుజాత సహకరించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా సంస్థలు సహకరిస్తే ఫేక్ న్యూస్‌ల వ్యాప్తిని సులభంగా నియంత్రించవచ్చని డీజీపీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details