అంతర్జాలంలో సామాజిక మాధ్యమాలను సురక్షితంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై మహిళలకు, చిన్నారులకు అవగాహన కల్పించేలా ఉద్దేశించిన కార్యక్రమాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో 'సైబ్ హర్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. సామాజిక మాధ్యమాలు వినియోగించే సమయంలో సరైన అవగాహన లేక మహిళలు, చిన్నారులు సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని ఎలా గ్రహించాలి అనేదానిపై మహిళలకు చిన్నారులకు అవగాహన కల్పించనున్నారు.
సైబర్ నేరాల బారిన పడకుండా 'సైబ్ హర్' - ts dgp latest
మహిళలు, చిన్నారులు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు 'సైబ్ హర్' పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. సింబియాసిస్ విశ్వవిద్యాలయం సహకారంతో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌తో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా మహిళా భద్రతా విభాగం అధికారులు ప్రణాళిక రచించారు.
![సైబర్ నేరాల బారిన పడకుండా 'సైబ్ హర్' http://10.1సైబర్ నేరాల బారిన పడకుండా 'సైబ్ హర్'0.50.75:6060///finalout2/bihar-nle/finalout/15-July-2020/8041825_rcp.jpeg](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8041127-162-8041127-1594830588779.jpg)
సైబర్ నేరాల బారిన పడకుండా 'సైబ్ హర్'
సింబియాసిస్ విశ్వవిద్యాలయం సహకారంతో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌తో పాటు ప్రసార మాధ్యమాల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా మహిళా భద్రతా విభాగం అధికారులు ప్రణాళిక రచించారు. మహిళలు, చిన్నారులను అవగాహన కలిగించేలా నెల రోజుల పాటు పలు అంశాలపై ఆన్‌లైన్ వేదికగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు.