హైదరాబాద్‌లో అమలవుతోన్న లాక్‌డౌన్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈసీఐయల్ చౌరస్తాలో, కూకట్‌పల్లి జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టులను డీజీపీ పరిశీలించారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా నిర్వహించాలని సిబ్బందికి పోలీస్ బాస్ సూచించారు. 10 గంటలు దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ రోడ్లపైకి రావొద్దని తెలిపారు. ఒకవేళ వస్తే ఆ వాహనాలను సీజ్ చేయాలని... తిరిగి లాక్‌డౌన్ తరువాత ఇవ్వాలని తెలిపారు.
లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా నిర్వహించాలి: డీజీపీ - లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా నిర్వహించాలని సిబ్బందికి డీజీపీ ఆదేశం
హైదరాబాద్‌లోని ఏర్పాటు చేసిన పలు చెక్‌పోస్టులను డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. అమలవుతున్న లాక్‌డౌన్‌ను పరిశీలించారు. లాక్‌డౌన్ సమయం దాటాకా ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ బయటికి రావద్దని హెచ్చరించారు.
ఉదయం 10 గంటల తర్వాత రహదారులపైకి వచ్చిన వాహనదారులపై పోలీసులు కఠినంగా వ్యవహారిస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చిన గూడ్స్ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. గూడ్స్ వాహనదారులు రాత్రి 9 నుంచి ఉదయం 8గంటల వరకే రవాణ ముగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. సమయం ముగిసిన తర్వాత డెలివరీలు తీసుకుని రోడ్లపైకి వచ్చిన జొమాటో తదితర సంస్థల సిబ్బందిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. గడువు ముగిసిన తర్వాత ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని సజ్జనార్ తెలిపారు. లాక్‌డౌన్ మొదలై చాలా రోజులైనా ఇప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని సీపీ అగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.