DGP Mahender reddy speech: సాంకేతికతలో వేగవంతమైన పురోగతి, చట్టం అమలు చేసే ఏజెన్సీల విస్తృత వినియోగం కారణంగా సంప్రదాయ నేరాలు కూడా దర్యాప్తు అవుతున్నాయని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్- ఏసీఎఫ్‌ఈ చాప్టర్ ఆధ్వర్యంలో 3వ వార్షిక సమావేశంలో డీజీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైబ్రిడ్ మోడ్‌లో ఈ కార్యక్రమానికి ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడు బ్రూస్ డోరిస్, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, సీపీ స్టీఫెన్ రవీంద్ర, అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు అమిత్ దూబేసహా 100 మంది సభ్యులు భౌతికంగా... అనేక దేశాల నుంచి ఆన్‌లైన్‌లో హాజరయ్యారు.
ACFE Hyderabad Chapter organised its 3rd Annual Conference:"అన్‌ఫోల్డింగ్ ఫ్రాడ్ డిటరెన్స్" అనే థీమ్‌లో భాగంగా జరిగిన సదస్సులో సైబర్ మోసాలు– ట్రాన్స్‌ఫార్మేటివ్ ట్రెండ్స్, సైబర్ చట్టం, మిటిగేషన్ మెథడ్స్, బ్యాకింగ్, ఆర్థిక మోసాలు, బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు- 2019 వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో 250 మందికిపైగా సభ్యులు ఉన్న ఈ ఏసీఎఫ్‌ఈ మోసాలను అరికట్టడంలో చేస్తున్న విశేషమైన కృషి, నాణ్యమైన శిక్షణల ద్వారా సభ్యులకు అందిస్తున్న విజ్ఞాన నవీకరణలను డీజీపీ అభినందించారు. అసోషియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్ష లేని యాంటీ-ఫ్రాడ్ ఆర్గనైజేషన్ అని... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ఎన్నో కేసులు విజయవంతంగా ఛేదింగల్గుతున్నామని అన్నారు.