సామాజిక మాధ్యామల్లో వివాదస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర పోలీసులు ప్రతి క్షణం ఇలాంటి వాటిని గమనిస్తూనే ఉంటారని తెలిపారు. తాజాగా బెంగళూరులో సోషల్ మీడియాలో పోస్టుల వల్ల చాలా నష్టం జరిగిందని... వదంతులను ప్రచారం చేస్తే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు.
'సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే వదిలేదిలేదు' - డీజీపీ మహేందర్ రెడ్డి
బెంగళూరు తరహా ఘటనలు ఎట్టి పిరిస్థితుల్లో సహించేది లేదని... ప్రజలంతా బాధ్యతగా మెలగాలని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యామల్లో వివాదస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని... వదంతులను ప్రచారం చేస్తే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు.
'సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే వదిలేదిలేదు'
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. బెంగళూరు తరహా ఘటనలు నగరంలో ఎట్టి పిరిస్థితుల్లో సహించేది లేదని... ప్రజలంతా బాధ్యతగా మెలగాలని నగర సీపీ అంజనీ కుమార్ తెలిపారు. శాంతి భధ్రతలు పరిరక్షణ ఉంటేనే భవిష్యత్ తరాలకు మంచి సమాజాన్ని అందిచగలుగతామని వివరించారు.