DGP on New Year Celebrations: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర పోలీస్ బాస్ స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీపీ తెలిపారు. ప్రతిఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఆదేశాలు అమలు చేయాలని పోలీసులుకు అదేశాలిచ్చామన్నారు.
DGP on New year restrictions: న్యూఇయర్ వేడుకలపై పోలీస్ బాస్ ఏమన్నారంటే..? - డీజీపీ మహేందర్రెడ్డి
![DGP on New year restrictions: న్యూఇయర్ వేడుకలపై పోలీస్ బాస్ ఏమన్నారంటే..? DGP mahender reddy on New Year's celebrations restrictions in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14049509-138-14049509-1640857454285.jpg)
14:15 December 30
DGP on New Year Celebrations: న్యూఇయర్ వేడుకలపై పోలీస్ బాస్ ఏమన్నారంటే..?
కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు డీజీపీ తెలిపారు. పబ్‌లు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని.. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం ఉందన్నారు. అందుకు అణుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని డీజీపీ సూచించారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా..
"కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలి. ఆరోగ్యశాఖ సూచనలను అమలు చేస్తాం. విమానాశ్రయంలో కూడా పరీక్షలు చేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తాం. పబ్‌లు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను కఠినంగా అమలు చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. ఎక్కడైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తాం. విధుల్లో ఉన్న పోలీసులు తప్పనిసరిగా మాస్కులు ధరించి విధుల్లో ఉండాలి."- మహేందర్రెడ్డి, డీజీపీ
ఇదీ చూడండి: