తెలంగాణ

telangana

ETV Bharat / city

Dgp Mahender Reddy : 'రాజు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలకు తావులేదు'

సైదాబాద్ రేప్ కేసు నిందితుడు రాజు ఆత్మహత్య విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి(Dgp Mahender Reddy) స్పష్టం చేశారు. ఈ విషయంపై ఎవరైన ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజు రైలు కిందపడటం ఏడుగురు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. వారి స్టేట్​మెంట్లను వీడియో రికార్డు చేసినట్లు చెప్పారు.

Dgp Mahender Reddy
Dgp Mahender Reddy

By

Published : Sep 17, 2021, 2:49 PM IST

రాజు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలకు తావులేదు

సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి(Dgp Mahender Reddy) స్పష్టం చేశారు. అతను ఆత్మహత్య చేసుకోవడం ఏడుగురు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. ఇద్దరు కోణార్క్ రైలు లోకో పెలట్లు, ఒక గాంగ్ మెన్, నలుగురు రైతులు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని చెప్పారు.

రాజు రైలు కింద పడటం చూసిన లోకో పైలట్లు సంబంధిత అధికారులకు తెలియజేశారని డీజీపీ(Dgp Mahender Reddy) వెల్లడించారు. అతను ఆత్మహత్యకు ముందు ట్రాక్​పై తిరగడం గాంగ్ మెన్ చూశాడని తెలిపారు. రాజు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు కింద పడటం అక్కడే పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూడా చూశారని చెప్పారు.

"రాజు ఆత్మహత్య విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అతనిది వందశాతం ఆత్మహత్యే. రాజు రైల్వే ట్రాక్​పై తిరగడం అక్కడున్న గాంగ్ మెన్ చూశాడు. వెంటనే అతణ్ని ప్రశ్నించగా.. పక్కనున్న చెట్ల పొదల్లోకి పారిపోయాడు. మళ్లీ కాసేపటికి తిరిగివచ్చిన గాంగ్​మెన్​కు పట్టాలపై పడి ఉన్న రాజు శవం కనిపించింది. అలాగే కోణార్క్ రైలు లోకో పైలట్లు కూడా రాజు రైలు కింద పడటం చూశారు. అక్కడే పంట పొలాల్లో పని చేస్తున్న రైతులు కూడా చూశారు. ఈ కేసులో ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వారి స్టేట్​మెంట్​ను వీడియో రికార్డు చేశాం. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. రాజు ఆత్మహత్య విషయంపై ఎలాంటి పుకార్లు పుట్టించొద్దు. ప్రజలకు లేనిపోని అనుమానాలు రేకెత్తించొద్దు."

- మహేందర్ రెడ్డి, తెలంగాణ డీజీపీ

ABOUT THE AUTHOR

...view details