ఆపరేషన్ స్మైల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో 3,178 పిల్లలను రక్షించినట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 7వ విడత ఆపరేషన్ స్మైల్లో 2,679 మంది బాలురు, 277 మంది బాలికలున్నారని తెలిపారు. 2,188 మంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించి, మిగతా పిల్లలను ఆశ్రమాల్లో ఉంచామని వెల్లడించారు. రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 17,224 పిల్లలు తప్పిపోయినట్లు కేసులు నమోదు కాగా... 12,807 మంది పిల్లల్ని గుర్తించి తల్లిదండ్రులకు అప్పజెప్పామని వివరించారు.
ఆపరేషన్ స్మైల్... రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల్లో 3,178 పిల్లలు సేఫ్ - operation muskan
ఆపరేషన్ స్మెల్లో భాగంగా కాపాడిన పిల్లల వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 7వ విడతలో 2,679 మంది బాలురు, 277 మంది బాలికలను కాపాడినట్టు వివరించారు. పిల్లలను గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించడం, పునరావాస కేంద్రాల్లో ఉంచేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
![ఆపరేషన్ స్మైల్... రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల్లో 3,178 పిల్లలు సేఫ్ dgp mahendar reddy release report on operation smile](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10440960-thumbnail-3x2-dgp.jpg)
తప్పిపోయిన పిల్లలను కాపాడేందుకు సమన్వయంతో పనిచేయాలి: డీజీపీ
ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాల్లో గుర్తించిన చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించడం, పునరావాస కేంద్రాల్లో ఉంచేందుకు సంబంధిత శాఖలు మరింత సమన్వయంతో పని చేయాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దళారులపై నిరంతరం నిఘా ఉంచి... వారిపై కేసులు నమోదు చేసి శిక్షలు పడే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
Last Updated : Jan 30, 2021, 10:03 PM IST