తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా జరగనున్నాయి. ఈ ఏడాది అదికమాసం కావడంతో స్వామివారికి రెండు మార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. గత నెలలో నిర్వహించిన వార్షిక ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించిన తితిదే... ఈ నెల 16 నుంచి 24వ తారీఖు వరకు జరగనున్న నవరాత్రి ఉత్సవాలను తిరువీధుల్లో భక్తుల మద్య నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా వెల్లడించిన కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నవరాత్రి ఉత్సవాలను కూడా ఏకాంతంగానే నిర్వహించనున్నట్లు తితిదే ప్రకటించింది.
ఏకాంతంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే జరగనున్నాయి. కొవిడ్ నేపథ్యంలో తితిదే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఏకాంతంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఈవో జవహర్ రెడ్డి తితిదే ఉన్నతాధికారులతో, జిల్లా యంత్రాంగంతో పలు మార్లు సమీక్షలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడం... 200 మందికి మించి... ఉత్సవాలు, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు తితిదే తెలిపింది.