Tirumala Rush : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో.. అలిపిరి తనిఖీ కేంద్రం వాహనాలు బారులు తీరాయి. తనిఖీలకు సమయం పడుతుండటంతో.. గంటల తరబడి భక్తులు వాహనాల్లోనే వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరి చెక్‌పోస్టు వద్ద వేలాది వాహనాలు - Tirumala Rush news
Tirumala Rush : తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో.. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. దీంతో.. భక్తులు గంటల కొద్దీ వేచి ఉన్నారు.
అధిక సంఖ్యలో భక్తులు సొంత వాహనాల్లో వస్తుండటం, వాటన్నింటిని తనిఖీలు చేయడానికి ఆలస్యమవుతోంది. ఫలితంగా.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా తిరుమలకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు కొండ పైన యాత్రికులకు అద్దె గదుల కొరత నెలకొంది. రద్దీకి సరిపడా గదులు లేకపోవడంతో కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. నిన్న 66,763 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 33, 133 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. రూ.4.29 కోట్ల హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు తితిదే ప్రకటించింది.