తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2022, 5:30 PM IST

ETV Bharat / city

తిరుమలలో మూడో రోజూ భక్తుల రద్దీ.. మరో రెండ్రోజులు కొనసాగే అవకాశం..

Devotees rush at Tirumala: గత మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. రద్దీకి తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Devotees rush to Tirumala
Devotees rush to Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ.. మరో రెండ్రోజులు కొనసాగే అవకాశం

Devotees rush at Tirumala: తిరుమలలో మూడో రోజూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు అన్నీ నిండిపోయాయి. 3 కిలోమీటర్లకు పైగా క్యూలైన్లల్లో భక్తులు వేచి ఉన్నారు. పెరటాసి మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. రద్దీ దృష్ట్యా రాత్రి దర్శనానికి వచ్చే భక్తులను ఉదయం రావాల్సిందిగా తితిదే కోరింది.

రాత్రి క్యూలైనులోకి వెళ్లిన భక్తులను నారాయణగిరి షెడ్లలో నుంచి వైకుంఠ కాంప్లెక్స్​లోకి అనుమతించారు. ఇవాళ ఉదయం కూడా రద్దీ అధికంగా ఉండటంతో గోగర్భం జలాశయం నుంచి భక్తులను క్యూలైనులోకి అనుమతించారు. భక్తులకు అల్పాహారం, పాలు, నీరు తితిదే సిబ్బంది అందజేస్తున్నారు. ఈ రద్దీ ఇంకా రెండ్రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

బ్రహ్మోత్సవాలు ముగిసినా తిరుమలలో రద్దీ పెరిగిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ ఉదయం, మధ్యాహ్నం గోగర్భం జలాశయం వద్ద నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లే క్యూలైన్లను కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. క్యూలైన్లలో వెళ్లే భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులను తితిదే కల్పించిన సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

'' బ్రహ్మోత్సవాలను ఈవో ధర్మారెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. పెరటాసి మాసం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు . వైకుంఠ కాంప్లెక్స్​ల నుంచి క్యూలైన్లు బయటికి వస్తే భక్తుల్లో అసంతృప్తి ఉంటుందని, క్యూలైన్లు బయటికి వచ్చినా సరే తితిదే అధికారులు అన్ని వసతులను భక్తులకు కల్పిస్తున్నారు. తితిదే ఈవో శక్తికి మించి పని చేస్తున్నారు''- భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే

ఇవీ చదవండి:కాంగ్రెస్ నేతలతో ఖర్గే భేటీ... అధ్యక్ష ఎన్నికల్లో మద్దతివ్వాలని విజ్ఞప్తి

టాపర్లకు హెలికాప్టర్ రైడ్.. హామీ నిలబెట్టుకున్న సీఎం.. విద్యార్థులు ఖుష్

ABOUT THE AUTHOR

...view details