ఏపీలోని తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం.. భక్తులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకునేందుకు.. కొంతమంది భక్తులు శనివారం మధ్యాహ్నం సిఫార్సు లేఖలతో దరఖాస్తు చేసుకున్నారు. రాత్రి 9 గంటలు అవుతున్నా టికెట్లు కేటాయించకపోవడంతో.. అదనపు ఈవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
Tirumala: తిరుపతిలో వీఐపీ దర్శన టికెట్ల కోసం భక్తుల ఆందోళన
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగారు. సిఫార్సు లేఖలపై దర్శనం కల్పించాలంటూ అడిషనల్ ఈవో కార్యాలయం వద్ద..నిరసన వ్యక్తం చేశారు. టికెట్లు ఇవ్వాలంటూ.. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
తిరుపతిలో వీఐపీ దర్శన టికెట్ల కోసం భక్తుల ఆందోళన
దూర ప్రాంతాల నుంచి వచ్చామని.. దర్శనం చేయకుండానే తిరిగి వెళ్లే పరిస్థితి కల్పిస్తున్నారని ఆవేదన చెందారు. ఉచిత దర్శనానికైనా అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. భక్తుల ఆందోళనను అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా..వారితో భక్తులు వాగ్వాదానికి దిగారు.
- ఇదీ చదవండి :'ఆ హీరోతో నటిస్తానని చిన్నప్పుడే సవాల్ చేశా'