తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్ మొరాయించడం వల్ల తితిదే నుంచి భక్తులకు అందించే సేవలు నిలిచిపోయాయి. 3 గంటలకుపైగా అవాంతరం ఏర్పడింది.
తిరుమలలో మొరాయించిన సర్వర్... నిలిచిన తితిదే సేవలు - సర్వర్ మొరాయింపుతో నిలిచిన తితిదే సేవలు
తిరుమలలో సర్వర్ మొరాయించడం వల్ల.. తితిదే సేవలు నిలిచిపోయాయి. సుమారు 3 గంటలకుపైగా సేవలు స్తంభించి.. భక్తులకు అసౌకర్యం కలిగింది. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు వేచిచూస్తున్నారు.
తిరుమలలో మొరాయించిన సర్వర్... నిలిచిన తితిదే సేవలు
ఫలితంగా తిరుమలలో గదుల కేటాయింపునకు విఘాతం కలిగింది. భక్తులు భారీ ఎత్తున నిరీక్షిస్తున్నారు. సమస్యను పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.