తెలంగాణ

telangana

ETV Bharat / city

TTD: శ్రీపద్మావతి ఆస్పత్రిలో సేవలందించడానికి దరఖాస్తులు ఆహ్వానించిన తితిదే - telangana news

తిరుమల శ్రీవారిని(ttd) దర్శించుకోవడానికి భక్తులు(devotees flow at Tirumala) పోటెత్తారు. శనివారం అత్యధికంగా 32,050 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి పిల్లల హృదయాలయం ఆసుపత్రిలో స్వచ్ఛందంగా సేవలందించడానికి దేశంలో గుర్తింపు పొందిన వైద్య నిపుణుల నుంచి తితిదే దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

TTD, devotees flow at Tirumala
శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తులు, తితిదేలో రద్దీ

By

Published : Oct 4, 2021, 9:43 AM IST

తిరుమల శ్రీవారి(ttd) దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. శనివారం అత్యధికంగా 32,050 మంది భక్తులు(devotees flow at Tirumala) స్వామివారిని దర్శించుకున్నారు. కొవిడ్‌(covid regulations in ttd) నేపథ్యంలో వ్యాక్సినేషన్‌(covid vaccination) సర్టిఫికేట్‌ లేదా 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ నెగిటివ్‌ రిపోర్టు తీసుకుంటేనే అధికారులు ఆలయంలోకి అనుమతిస్తున్నారు.

తిరుపతిలోని శ్రీపద్మావతి పిల్లల హృదయాలయం(శ్రీపద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌) ఆసుపత్రిలో స్వచ్ఛందంగా సేవలందించడానికి దేశంలో గుర్తింపు పొందిన వైద్య నిపుణుల నుంచి తితిదే దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రాణదానం పథకం కింద నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువులు, పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు, వైద్యసేవలు అందించడానికి పదిహేను ఏళ్ల అనుభవం కలిగి, హిందూ మతానికి చెందిన పీడియాట్రిక్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్లు అర్హులని తెలిపింది. ఈ సేవలు రెండు విధానాల్లో ఉంటాయని పేర్కొంది. ఆప్షన్‌-ఎ కింద సేవకు వచ్చే వైద్యుడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీవారి ప్రొటోకాల్‌ దర్శనం, తిరుపతి-తిరుమల మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పించనుంది. ఆప్షన్‌-బి కింద తితిదే నియమ నిబంధనల మేరకు వైద్య నిపుణులకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లిస్తుంది. రెండో ఆప్షన్‌ ఎంచుకున్న వారికి వసతి, దర్శనం, స్థానిక రవాణా సదుపాయాలు ఉండవు. ఆసక్తి ఉన్న వైద్యులు cmo.adldirector@gmail.com మెయిల్‌ ఐడీకి వివరాలు పంపాలని కోరింది.

6న తితిదే నూతన ధర్మకర్తల మండలి సమావేశం

తితిదే నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం ఈ నెల 6వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు పలువురు ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశం 6న నిర్వహించేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. గతంలో బోర్డు తీసుకున్న నిర్ణయాల పురోగతిని పరిశీలించడంతోపాటు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, నూతన అంశాలను ఎజెండాలో చేర్చి చర్చించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:వంటింట్లో ఆ సమస్యా? అయితే ఇలా చేయండి..!

ABOUT THE AUTHOR

...view details