తెలంగాణ

telangana

ETV Bharat / city

వారణాసిలో గంగా హారతి.. ఆంధ్ర భక్త బృందం సందడి - varanasi ganga harathi news update

ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో నిత్యం జరిగే గంగా హారతి కార్యక్రమం ప్రసిద్ధి పొందింది. విశిష్టమైన ఈ కార్యక్రమాన్ని నేరుగా దర్శించుకోలేక.. లాక్​డౌన్​ సమయంలో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో.. ఇప్పుడిప్పుడే పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వేడుకను నేరుగా తిలకిస్తున్నారు. ఆంధ్రులు సైతం.. వారణాసిలో గంగా హారతిని దర్శించుకుని.. భావోద్వేగానికి గురయ్యారు.

ganga harathi
వారణాసిలో గంగా హారతి.. ఆంధ్ర భక్త బృందం సందడి

By

Published : Nov 22, 2020, 7:42 PM IST

ప్రపంచ వ్యాప్త ప్రసిద్ధి పొందిన వారణాసి గంగా హారతిని.. ఏపీకి చెందిన భక్తజన బృందం దర్శించుకుంది. దశాశ్వమేధ ఘాట్​లో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు.. ఎంతో ఆనందించినట్టు చెప్పారు.

లాక్​డౌన్​ కాలంలో నేరుగా వారణాసికి రాలేకపోయామని.. ఈటీవీ భారత్​లో నిత్యం ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. గంగా హారతిని తిలకించామని చెప్పారు. క్రమం తప్పకుండా గంగా హారతిని తమకు అందించారంటూ ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపారు.

వారణాసిలో గంగా హారతి.. ఆంధ్ర భక్త బృందం సందడి

ఇవీచూడండి:జట్టుకు ఎరుపు రంగు వేసుకుంటే కరోనా రాదా?​

ABOUT THE AUTHOR

...view details