తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుపతి విష్ణు నివాసం ఎదుట భక్తుల ఆందోళన - శ్రీవారి దర్శనం టోకెన్లు ముందస్తుగా ఇవ్వడంపై భక్తుల ఆందోళన

తిరుపతి విష్ణు నివాసం ఎదుట.. శ్రీవారి భక్తులు ఆందోళన నిర్వహించారు. 24వ తేదీకి సంబంధించిన సర్వ దర్శనం టోకెన్లను ముందస్తుగా ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

tirumala news
తిరుపతి విష్ణు నివాసం ఎదుట భక్తుల ఆందోళన

By

Published : Dec 20, 2020, 11:10 AM IST

శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ విషయమై.. తిరుపతి విష్ణు నివాసం ఎదుట భక్తులు ఆందోళన చేపట్టారు. 24వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లను ముందస్తుగా ఇవ్వడంపై భక్తులు ఆగ్రహించారు. దర్శనం కోసం నాలుగైదు రోజులు ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు.

రోజువారీ పరిమితి దాటిన కారణంగానే... 24వ తేదీ టోకెన్లు ఇస్తున్నామని తితిదే పేర్కొంది. 21, 22, 23 తేదీల సర్వ దర్శనం టోకెన్లు ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసింది. భక్తులను వెనక్కి పంపకూడదనే టోకెన్లు జారీ చేస్తున్నామన్న తితిదే అధికారులు వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి:కాస్త ఆలోచించకపోతే.. ఖర్చయిపోతాం

ABOUT THE AUTHOR

...view details