తెలంగాణ

telangana

ETV Bharat / city

YS Viveka Murder Case: సీబీఐ కస్టడీకి నిందితుడు శివశంకర్‌ రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని 7 రోజుల సీబీఐ కస్టడీకి అనమతినిస్తూ.. పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కడప కేంద్ర కారాగారంలో రిమాండ్​లో ఉన్నారు.

YS Viveka Murder Case
వివేకా హత్య కేసు

By

Published : Nov 25, 2021, 7:54 PM IST

YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ్యత కేసులో అరెస్టయి రిమాండ్​లో ఉన్న.. దేవిరెడ్డి శివశంకర్​ రెడ్డిని సీబీఐ కస్టడీకి (Devireddy Shivashankar Reddy to CBI custody) అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో ఉన్న దేవిరెడ్డిని 8 రోజులు కస్టడీకీ ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్​పై వాదనలు విన్న న్యాయస్థానం.. 7 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. డిసెంబరు 2 వరకు దేవిరెడ్డి కస్టడీ కొనసాగనుంది.

అనుమానితుల్లో శివశంకర్ రెడ్డి..

వివేకా(Viveka murder case news) హత్య కేసులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ ఈనెల 17న హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. ఆయన కడప ఎంపీ వైఎస్‌.అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌ రెడ్డి ప్రస్తావన ఉంది. వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగి రెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నారు. దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ ఇటీవల సమాచారమిచ్చింది. అయితే అనారోగ్య కారణాలతో తాను హైదరాబాద్‌లో ఉన్నానని, తర్వాత వస్తానంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సీబీఐ ప్రత్యేక బృందం ఈనెల 17న హైదరాబాద్‌లో ఆయన్ను పట్టుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించింది. అనంతరం ఆయన్ను కడప తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్‌ వారెంట్‌ కోసం నాంపల్లి మేజిస్ట్రేట్‌ ఎదుట ప్రవేశపెట్టింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ వివేకా కుమార్తె సునీత గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పొందుపరిచిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్‌ రెడ్డి(Viveka murder case update) ఒకరు. ఆయనపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

దస్తగిరి వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన ఇలా..(దస్తగిరి మాటల్లోనే)

  • 'వై.ఎస్‌.వివేకాను చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు... మేమూ నీతో వస్తాం. దీని వెనుక వైఎస్‌.అవినాశ్ రెడ్డి, వైఎస్‌.మనోహర్‌ రెడ్డి, వైఎస్‌.భాస్కర్‌ రెడ్డి. డి.శివశంకర్‌ రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు' అని ఎర్ర గంగి రెడ్డి నాతో చెప్పారు.
  • 'వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి మనకు రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తా' అని ఎర్ర గంగిరెడ్డి నాతో అన్నారు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వై.ఎస్‌.వివేకా ఓ రోజు అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడున్న శివశంకర్‌రెడ్డిని చూసి 'నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు. నన్ను నా కుటుంబసభ్యులకు దూరం చేశావు. నీ అంతు చూస్తా' అని హెచ్చరించారు. తర్వాత అవినాశ్ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డిలను చూస్తూ 'మీ అందరి కథ చెబుతా' అంటూ కేకలేశారు.
  • శివశంకర్‌ రెడ్డితో పాటు వై.ఎస్‌.భాస్కర్‌ రెడ్డి, వై.ఎస్‌.అవినాశ్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి సరిగ్గా మద్దతివ్వని కారణంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారు.
  • వివేకా హత్య జరిగిన తర్వాత రోజు ఉదయం 5 గంటలకు ఎర్ర గంగిరెడ్డి నన్ను ఆయన ఇంటికి పిలిపించారు. 'మీరేం భయపడొద్దు. నేను శివశంకర్‌ రెడ్డి, వై.ఎస్‌.అవినాశ్ రెడ్డితో మాట్లాడాను. వాళ్లు అంతా చూసుకుంటామన్నారు. నీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తా' అని నాతో చెప్పారు.
  • ఈ ఏడాది మార్చి 3న దిల్లీకి రావాలంటూ సీబీఐ అప్పట్లో నాకు నోటీసులు ఇచ్చింది. దీంతో డి.శివశంకర్‌ రెడ్డి, విద్యా రెడ్డి, భయపు రెడ్డి నన్ను పిలిచారు. వారి పేర్లు ఎక్కడా చెప్పొద్దని నాకు డబ్బులు ఇస్తామన్నారు. నా జీవితం సెటిల్‌ చేసేస్తామన్నారు. తర్వాత దిల్లీలో నా వద్దకు భరత్‌ యాదవ్‌ను పంపించారు. అక్కడ జరిగే విషయాలన్నీ శివశంకర్‌రెడ్డికి తెలియజేయమనేవారు.

ఇదీ చదవండి:NGT fire on Telangana govt: రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details