తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని ఉమపై మే 7 వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఆదేశాలు ఉన్నాయి. నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జూన్ 17 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
'దేవినేని ఉమపై చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు పొడిగింపు' - తెలంగాణ వార్తలు
తెదేపా నేత దేవినేని ఉమ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో ఆయన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉమపై మే 7 వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఆదేశాలు ఉండగా దీనిని జూన్ 17 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
దేవినేని ఉమపై హైకోర్టు వ్యాఖ్యలు, ఏపీ హైకోర్టు
గుంటూరు సీఐడీ డీఎస్పీ విచారణాధికారిగా ఉండాలంటే కొనసాగవచ్చుని ఏపీ హైకోర్టు తెలిపింది. ఆ రాష్ట్ర సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఇదీ చదవండి:పన్ను ఆదాకు ఉత్తమ పెట్టుబడులు ఇవే..