తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2021, 10:23 AM IST

ETV Bharat / city

'వెలిగొండ' టన్నెల్‌ బోరింగు మిషన్‌ ధ్వంసం

వెలిగొండ ప్రాజెక్టు కోసం పుష్కరకాలం విశేష సేవలందించిన టన్నెల్‌ బోరింగు మిషన్​ని ధ్వంసం చేశారు. ప్రాజెక్టు మొదటి టన్నెల్​ నిర్మాణానికి ఈ యంత్రమే ఆధారమైంది. పుష్కర కాలంపాటు విశిష్ట సేవలందించిన ఈ యంత్రాన్ని తిరిగి వెనక్కి తెచ్చే అవకాశం లేక చివరకు ధ్వంసం చేయాల్సి వచ్చింది.

veligonda project
veligonda project

ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల నేల తల్లిని సస్యశ్యామలం చేసే వెలిగొండ ప్రాజెక్టుకు ఆకృతిని తీసుకొచ్చేందుకు సహకరించిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది. నిరంతరంగా పుష్కర కాలంపాటు విశిష్ట సేవలందించిన ఈ యంత్రాన్ని తిరిగి వెనక్కి తెచ్చే అవకాశం లేక చివరకు ధ్వంసం చేయాల్సి వచ్చింది. గంగమ్మకు దారి చూపేందుకు వచ్చిన ఈ యంత్రాన్ని స్థానికులు అపురూపంగా చూశారు. యంత్రంలో ఉన్న సాంకేతిక పరికరాలను చూసి అబ్బురపడ్డారు.

2008లో టన్నెల్ బోరింగ్ మిషన్​

టన్నెల్‌ నిర్మాణానికి బోరింగ్‌ మిషన్‌ తప్పక అవసరమని నిర్ణయించి రూ.128 కోట్లు వెచ్చించి జర్మనీ నుంచి 2008లో తెప్పించారు. ఈ యంత్రం కొండను తొలుస్తూ ముందుకెళ్లడమే తప్ప వెనక్కు తెచ్చే వీలులేదు. మొదటి టన్నెల్‌ను నిర్మించడంతో యంత్రాన్ని ఈ మధ్యే 99శాతం ధ్వంసం చేసి విడిభాగాలను తుక్కుగా బయటకు తెచ్చారు.

ఇదీ చదవండి:తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం

ABOUT THE AUTHOR

...view details