తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ టోపీ పెట్టుకోండి.. భౌతిక దూరం పాటించండి! - రాజమహేంద్రవరం వార్తలు

'భౌతిక దూరం'...! ఇప్పుడు ప్రతి మనిషి తప్పక పాటించాల్సిన విధానం. కరోనా సంక్రమించకుండా... ఇంతకు మించిన మార్గం లేదు. అవగాహన కలిగిన పెద్దవాళ్లు దూరం పాటిస్తారు. ఈ విషయాలేవీ అర్థం కాని చిన్నారులు.... దూరం పాటించడం కాస్త కష్టమే. అలాంటివారి కోసమే ఓ వినూత్నమైన టోపీ తయారైంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

design for the social distancing alarming cap
ఈ టోపీ పెట్టుకోండి.. భౌతిక దూరం పాటించండి!

By

Published : Apr 30, 2020, 12:09 AM IST

ఈ టోపీ పెట్టుకోండి.. భౌతిక దూరం పాటించండి!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు ప్రాంతానికి చెందిన ప్రెయిజీ... ఐదో తరగతి విద్యార్థిని. ప్రస్తుతం కరోనా విజృంభణతో ఎటుచూసినా ఆందోళనకర వాతావరణం ఉండటాన్ని గమనించింది. భౌతికదూరం పాటించాలని అందరూ చెప్పడం ఆలకించింది. భౌతిక దూరంపై పెద్దవాళ్లతో పాటు చిన్నపిల్లల్లోనూ అప్రమత్తత కలిగించడం ఎలా అని ఆలోచించి. తండ్రి మురళీకృష్ణతో చర్చించింది. ఆ తండ్రీకూతుళ్ల ఆలోచనల్లోంచి వచ్చిందే 'సోషల్ డిస్టెన్సింగ్ అలార్మింగ్' టోపీ. ఇది తలపై పెట్టుకుంటే... మీటరు దూరంలోపు ఎవరైనా మనిషి వస్తే.... వెంటనే అలారం మోగుతుంది. అప్రమత్తమయ్యేలా చేస్తుంది.

తయారీ ఖర్చు రూ.900

ఈ టోపీకి నాలుగు వైపులా సెన్సార్లు ఏర్పాటు చేశారు. మధ్యలో కంట్రోలర్ ఉంటుంది. ఈ సెన్సార్లను కంట్రోలర్‌తో అనుసంధానించారు. టోపీ తయారు చేసేందుకు 9వందల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని... బీఎస్ఎన్​లో జేఈగా పనిచేస్తున్న ప్రెయిజీ తండ్రి మురళీకృష్ణ తెలిపారు.

'సోషల్ డిస్టెన్సింగ్ అలార్మింగ్' టోపీ పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని... భౌతిక దూరం పాటించేలా అప్రమత్తం చేస్తుందని ప్రెయిజీ సంతోషంగా చెబుతోంది.

ఇవీ చదవండి...కొవిడ్‌ చికిత్సలో వైద్యులకు తోడ్పాటుగా... నెల్లూరు రోబో

ABOUT THE AUTHOR

...view details