శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్ తన నియోజకవర్గం పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో వారం ఒక్కో బస్తీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. గత యాభై ఏళ్లలో పరిష్కారానికో నోచుకోని ఎన్నో సమస్యలను తాము కేవలం ఐదేళ్లలోనే పూర్తి చేస్తామని పద్మారావు గౌడ్ తెలిపారు. సమస్యల పరిష్కారాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతున్నామని.. అన్ని శాఖల అధికారులతో బస్తీల్లో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సీతాఫల్ మండిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు, మంచి నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం, రహదారుల విస్తరణ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందిరానగర్, చిలకలగూడ, మధురానగర్, మేదిబవి, మనికేశ్వర్ నగర్, బీదల బస్తీల వాసులు పలు సమస్యలను ఉపసభాపతి దృష్టికి తీసుకువచ్చారు. సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముషీరాబాద్‌లో 91 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఉప సభాపతి ప్రజాదర్బార్
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రతివారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. వారానికో బస్తీలో అధికారులు, స్థానికులతో సమావేశం ఏర్పాటుచేసి.. సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టిన ఉప సభాపతి