సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ (సీతాఫల్‌మండీ), దోబీ ఘాట్ (మెట్టుగూడ) డివిజన్లలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. జులై తొలి వారంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెండు పడకల ఇళ్ల నిర్మాణంపై సీతాఫల్‌మండీలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Deputy speaker: 'త్వరగా డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించండి' - teelangana news
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరగా ప్రారంభించాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు అద్దె ఇళ్లలో నివసించాల్సిన పరిస్థితిని వెంటనే తప్పించాలని సూచించారు.
రూ. 26 కోట్ల ఖర్చుతో సుభాష్ చంద్రబోస్ నగర్లో 60, దోబీ ఘాట్‌లో 207 ఇళ్లను నిర్మించినట్లు పద్మారావు గౌడ్ తెలిపారు. పేద ప్రజలు అద్దె ఇళ్లలో నివసించాల్సిన పరిస్థితిని తప్పించాలని.. వెంటనే ప్రారంభోత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఇళ్ల ప్రారంభోత్సవానికి వీలైనంత త్వరలో ఏర్పాట్లు జరుపుతామని అధికారులు పేర్కొన్నారు. ఈ సమీక్షలో తహసీల్దార్ సునీల్ నహటా, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: CM KCR: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం