ప్రభుత్వం వరద బాధితులకు అందించే రూ.పది వేల ఆర్థిక సాాయంలో దళారీలు జోక్యం చేసుకుంటే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉపసభాపతి పద్మారావుగౌడ్ హెచ్చరించారు. సికింద్రాబాద్ పరిధిలో రెండో విడత ఆర్థిక సాయం పంపిణీపై అధికారులు, నేతలతో సమీక్షించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.పది వేల చొప్పున ఆర్థిక సాాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.
'వరద బాధితుల ఆర్థిక సాయంలో దళారుల జోక్యం తగదు'
సికింద్రాబాద్‌లో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేతపై ఉపసభాపతి పద్మారావుగౌడ్ సమీక్ష నిర్వహించారు. రూ.పది వేలు ఆర్థిక సాయంలో దళారీలు జోక్యం చేసుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్‌మండీ, బౌద్ధనగర్ డివిజన్లో రెండో విడతలో అర్హత కలిగిన కుటుంబాలకు సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని పద్మారావుగౌడ్ తెలిపారు. దళారీల ప్రమేయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా దళారీలు, తాము డబ్బులు ఇప్పిస్తామని నమ్మిస్తే వెంటనే నామాలగుండులోని తమ క్యాంపు కార్యాలయాన్ని 040-27504448 నంబర్ ద్వారా సంప్రదించాలని లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇదీ చదవండిఃధరణిపై హైకోర్టు కీలక ఆదేశాలు... నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు