సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఐదు డివిజన్ల మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్. శనివారం సికింద్రాబాద్ సితాఫల్మండిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విభిన్న సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని పద్మారావ్ గౌడ్ పేర్కొన్నారు.
సీతాఫల్‌మండిలో ఉపసభాపతి బతుకమ్మ చీరల పంపిణీ - పద్మారావు గౌడ్ బతుకమ్మ చీరల పంపిణీ వార్తలు సీతాఫల్మండి
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు మహిళలకు చీరలు అందిస్తున్నారు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో.. ఐదు డివిజన్లకు సంబంధించిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఉపసభాపతి పద్మారావు.. ఆడపడుచులకు ప్రభుత్వ కానుకను అందించారు. చీరలు తీసుకునేందుకు సీతాఫల్‌మండిలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లోకి భారీగా మహిళలు తరలివచ్చారు.
![సీతాఫల్‌మండిలో ఉపసభాపతి బతుకమ్మ చీరల పంపిణీ సీతాఫల్‌మండిలో ఉపసభాపతి బతుకమ్మ చీరల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9123641-thumbnail-3x2-padmarao-goud.jpg)
సీతాఫల్‌మండిలో ఉపసభాపతి బతుకమ్మ చీరల పంపిణీ
అన్ని పండుగలను, సంస్కృతులను ప్రభుత్వం ఆదరిస్తోందన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరల పంపిణీ ఉపకరించనుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు కానుకగా ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. అక్టోబర్ 9 నుంచి 15 వరకు ఈ పంపిణీ కొనసాగుతుందన్నారు
ఇదీ చదవండి:ఆడపడుచుల గౌరవాన్ని పెంచేందుకే బతుకమ్మ చీరలు : మంత్రి ఎర్రబెల్లి