సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెరాస తన సత్తాను నిరూపించుకుందని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఐదు డివిజన్లను కైవసం చేసుకుందన్నారు. తార్నాక డివిజన్ కార్పొరేటర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డికి హైదరాబాద్ డిప్యూటీ మేయర్ పదవి లభించిన సందర్భంగా.. సీతాఫల్మండిలో సన్మాన కార్యక్రమం జరిగింది.
మంచి పేరు తెచ్చుకోవాలి:
"శ్రీలతకి డిప్యూటీ మేయర్ పదవి దక్కడం ఆనందంగా ఉంది. త్వరలోనే సీతాఫల్మండిలో నూతనంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నాం. నియోజకవర్గానికి చెందిన అన్ని డివిజన్ల కార్పొరేటర్ల కార్యాలయాలను ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తాం. డిప్యూటీ మేయర్‌తో సహా కార్పొరేటర్లు ప్రతి రోజు కొంత సమయం ఖచ్చితంగా ప్రజలకు ఈ కార్యాలయం ద్వారానే అందుబాటులో ఉంటారు. నిత్యం ప్రజల్లో ఉంటూ కార్పొరేటర్లు మంచి పేరు తెచ్చుకోవాలి. మోతె శ్రీలత రెడ్డికి డిప్యూటీ మేయర్ పదవిని కల్పించినందుకు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతఙ్ఞతలు. "