ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో ఆపరేషన్ పరివర్తన్ చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి(Ap deputy cm narayana swamy) స్ఫష్టం చేశారు. ఏవోబీలోని 58 గ్రామాల్లో ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 2,228 ఎకరాల్లో సాగు చేస్తున్న రూ.626 కోట్ల విలువైన గంజాయి పంటను ధ్వంసం చేశామన్నారు. పోలీసులు, ఎస్ఈబీ అధికారులు 153 బృందాలుగా ఏర్పడి ఆపరేషన్ పరివర్తన్ చేపట్టారని తెలిపారు. గంజాయి సాగు చేయకుండా అధికారులు మన్యం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి లాభదాయకమైన ఇతర పంటల వైపు వారు మెుగ్గు చూపే విధంగా ప్రొత్సహిస్తున్నారని అన్నారు.
Ap deputy cm narayana swamy: 'మన్యం ప్రజల్లో అధికారులు చైతన్యం తెస్తున్నారు' - డిప్యూటీ సీఎం నారాయణ స్వామి న్యూస్
ఏవోబీలో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టి రూ. 626 కోట్ల విలువైన గంజాయి పంటను ధ్వంసం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి(Ap deputy cm narayana swamy) స్పష్టం చేశారు. పోలీసులు, ఎస్ఈబీ అధికారులు 153 బృందాలుగా ఏర్పడి 2,228 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేశామన్నారు.
AP deputy cm