గిరిజనుల అభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ సూర్యకుమారి, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, ఉప కలెక్టర్ భావన, ఎమ్మెల్యే జోగారావు తదితరులు ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
ఘనంగా ఆదివాసీ దినోత్సవం... నృత్యం చేసిన ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
ఏపీ విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి (pushpa srivani) పాల్గొన్నారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని ఆమె అన్నారు.
ఆదివాసీ
అడవి తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి... విద్యార్థినులతో కలిసి థింసా నృత్యం చేశారు. సాగు పట్టాలు, యంత్ర పరికరాలు, సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను అందజేశారు.
ఇదీ చదవండి: ఇంద్రవెల్లి స్ఫూర్తితో గడీల పాలనను పారదోలుదాం: రేవంత్ రెడ్డి