ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం ఒడిశాలోని పారాదీప్‌కు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యింది. ఇది సాయంత్రానికి తుపానుగా బలపడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. దీని వలన కోస్తాంధ్ర, ఒడిశా తీరం వెంబడి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
తుపానుగా బలపడనున్న వాయుగుండం.. వర్ష సూచన - బంగాళాఖాతంలో వాయుగుండం న్యూస్
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా తీరం వెంబడి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం.. వర్ష సూచన